సజీవ సమాధికి యత్నించిన పప్పడ్ బాబా.. చివరి క్షణంలో.. - బాబా సజీవ సమాధి
సజీవ సమాధి అవ్వాలని ప్రయత్నించిన.. ఓ బాబాను మధ్యప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. మోరెనా జిల్లా తుస్సిపురా గ్రామానికి చెందిన.. 105 ఏళ్ల వయసున్న పప్పడ్ బాబా సజీవ సమాధి (Pappad Baba took Samadhi in Moren) అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను బాబా అనుచరులు సిద్ధం చేశారు. ఈ క్రమంలో సమాధిలో పడుకున్న బాబా తనపై మట్టి చల్లి సమాధిని పూడ్చాలని ఆదేశించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని బాబాను అడ్డుకున్నారు. సమాధి నుంచి ఆయన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయంలో సజీవ సమాధికి బాబా ప్రయత్నించగా పోలీసుల రంగప్రవేశంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.