ప్రాణాలకు తెగించి చిన్నారుల్ని కాపాడిన సైన్యం - పిల్లలు
జమ్ముకశ్మీర్ పూంచ్‌లోని బాలాకోట్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంట పాక్ మరోసారి వక్రబుద్ధి చూపించింది. గ్రామీణులు, చిన్నారులున్నారనే విచక్షణ లేకుండా శనివారం బాలాకోట్, మాన్‌కోట్, మెందర్ సెక్టార్‌లోని పలు గ్రామాలపై కాల్పులకు తెగబడింది. అదే సమయంలో పాఠశాలలో ఉన్న 50 మంది చిన్నపిల్లలు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, అధికారులు ప్రాణాలు తెగించి విద్యార్థుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
Last Updated : Sep 30, 2019, 3:54 PM IST