వాఘా సరిహద్దుల్లో పాక్ స్వాతంత్ర్య వేడుకలు - వాఘా సరిహద్దుల్లో మిఠాయిలు పంచుకున్న సైన్యం
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆ దేశ రేంజర్లు ఘనంగా జరుపుకున్నారు. పంజాబ్లోని అమృత్సర్ దగ్గర ఉండే అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద భారత సైనికులకు మిఠాయిలు పంచి పెట్టారు. పాక్ రేంజర్లకు భారత సరిహద్దు దళం సిబ్బంది(బీఎస్ఎఫ్) శుభాకాంక్షలు తెలిపారు. పంద్రాగస్టు నాడు తాము కూడా పాక్ రేంజర్లకు మిఠాయిలు పంచి పెడుతామని బీఎస్ఎఫ్ కమాండెంట్ జస్బీర్ సింగ్ తెలిపారు.
Last Updated : Aug 14, 2021, 1:12 PM IST