తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎలుగుబంట్ల ఫుట్​బాల్ ఆట.. బాల్​తో అడవిలోకి పరార్! - odisha bear football

By

Published : Sep 14, 2021, 8:38 AM IST

ఒడిశాలో రెండు ఎలుగుబంట్లు ఫుట్‌బాల్‌తో ఆడుకోవడం (Bear playing Football) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నవరంగ్‌పూర్‌ జిల్లా సుకిగావ్‌ ప్రాంతంలో.. తల్లి, పిల్ల ఎలుగుబంట్లు తమకు దొరికిన ఫుట్‌బాల్‌తో.. చాలా సేపు ఆడుకున్నాయి. అనంతరం ఫుట్‌బాల్ తీసుకుని అడవిలోకి పారిపోయాయి. అడవి జంతువులు ఫుట్‌బాల్‌తో ఆడుకోవడం చూసిన స్థానికులు ఆశ్చర్యంతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ఈ వీడియో తీసిన వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అడవి ఎలుగుబంట్లు ఫుట్‌బాల్‌తో ఆడటం సాధారణంగా జరగదన్న.. నవరంగ్‌పూర్‌ (Odisha nabarangpur) డిప్యూటీ ఫారెస్ట్‌ అధికారి మగర్‌ ధనాజీ రావు... అది ఏమిటో తెలుసుకునే క్రమంలో అవి చేసిన చేష్టలే ఆటమాదిరిగా కనిపించినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details