తెలంగాణ

telangana

ETV Bharat / videos

హోంమంత్రిని తొలగించాలంటూ నిరసనలు.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు

By

Published : Dec 9, 2021, 9:42 PM IST

Mamita Meher Case: ఒడిశా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా యువ మోర్చా కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఓ హత్య కేసులో హోంమంత్రి దిబ్యా శంకర్‌ మిశ్రా ప్రమేయం ఉందని, ఆయనను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ.. యువ మోర్చా కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు డిమాండ్‌ చేశారు. బారికేడ్లను దాటి లోపలికి వెళ్లేందుకు భాజపా కార్యకర్తలు ప్రయత్నించటంతో ఉద్రిక్తత చెలరేగింది. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. అనంతరం నిరసనకారులను అదుపులోకి తీసుకొని పోలీసు వాహనాల్లో తరలించారు.

ABOUT THE AUTHOR

...view details