అగ్గిపుల్లలతో యుద్ధ ట్యాంక్- ఔరా అనిపించే ఆర్ట్! - అగ్గిపుల్లలతో ఆర్ట్
సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఓ యువకుడు అగ్గిపుల్లలతో తయారు చేసిన యుద్ధ ట్యాంకు ఆకట్టుకుంటోంది. ఒడిశాలోని పూరికి చెందిన శస్వత్ రంజన్ సాహో అనే యువ కళాకారుడు.. 2వేల 254 అగ్గిపుల్లలను ఉపయోగించి యుద్ధ ట్యాంకు రూపొందించాడు. భారత ఆర్మీ శౌర్యాన్ని, ధైర్య సాహసాలను గుర్తు చేసుకోవటానికి అగ్గిపుల్లలతో ఈ యుద్ధ ట్యాంకు తయారు చేశానని శస్వత్ తెలిపాడు. దీని తయారీకి 6 రోజుల సమయం పట్టిందన్నాడు. 9 అంగుళాల ఎత్తు, 8 అంగుళాల వెడల్పుతో యుద్ధ ట్యాంకు తయారు చేశానని చెప్పాడు.