పడక గదిలో నక్కిన 14 అడుగుల కింగ్ కోబ్రా - నిస్చింత గ్రామంలో 14 అడుగులు పొడవు ఉన్న కింగ్ కోబ్రా
ఒడిశా మయూర్భంజ్లోని నిస్చింత గ్రామంలో 14 అడుగులు పొడవు ఉన్న కింగ్ కోబ్రాను అటవీ శాఖ సిబ్బంది రక్షించారు . స్థానికంగా ఉండే అశోక్ మహాపాత్ర అనే అధ్యాపకుని ఇంట్లో కోబ్రా ఉన్నట్లు తెలిపారు. ఇంటి యజమాని నిద్రలేచే సమయానికి పడక గదిలో కింద విషసర్పం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బయటకు పరిగెత్తిన కుటుంబ సభ్యులు.. అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న వారు కోబ్రాను పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు.