ఓట్ల లెక్కింపులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
తమిళనాడులోని తిరుమంగళం స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రెండు బృందాల సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చకుండా.. భద్రతాసిబ్బంది వెంటనే స్పందించి అల్లరి మూకలను చెదరగొట్టారు. దాడికి కారకులైన వారిని అదుపులోకి తీసుకున్నారు.