బెంగళూరు మహానగర పాలిక అధికారులపై స్థానికుల దాడి! - కరోనా తాజా వార్తలు
కరోనా విజృంభణ లింకును ఛేదిస్తున్న సిబ్బందిపై బెంగుళూరులో స్థానికులు దాడికి తెగబడ్డారు. పడరణ్యాపూర ప్రాంతంలో క్వారెంటైన్‌లో ఉన్న వారి వద్దకు వెళ్లిన బృహత్ బెంగుళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) అధికారులపై విధ్యంసానికి పాల్పడ్డారు. ప్రభుత్వ టెంట్లను ధ్వంసం చేసిన స్థానికులు సిబ్బందిని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.