మూడో అంతస్తు నుంచి పడ్డ బాలుడు.. పట్టేసిన యువకులు - లైవ్: భవనం పైనుంచి పడిపోయిన బాలుడిని కాపాడిన స్థానికులు
గుజరాత్లోని దమన్ దీవ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భవనం మూడో అంతస్తు నుంచి కిందపడుతున్న బాలుడిని స్థానికులు సురక్షితంగా కాపాడారు. బాలుడు కిందపడటం గమనించిన స్థానిక యువకుడు... రక్షించడానికి అక్కడే నిల్చున్నాడు. కిందపడబోయే సమయంలో సురక్షితంగా పట్టుకున్నాడు. బాలుడికి ఎటువంటి గాయాలు కాలేదు. నిన్న జరిగిన ఈ ఘటన తాలూకు దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. బాలుడిని కాపాడిన స్థానికులపై సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.