రోడ్డు లేక అవస్థలు.. మంచంపై గర్భిణీని మోసుకెళ్లిన గ్రామస్థులు - lack of road Jharkhand villagers carry pregnant woman on cot
సరైన రోడ్డు వసతి లేకపోవడం వల్ల ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. గుడియా దేవి అనే మహిళ.. పురిటి నొప్పులతో బాధపడుతున్న నేపథ్యంలో.. మంచాన్ని డోలీలా మార్చి భుజాలపై రెండు గంటల పాటు మోసుకెళ్లారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారింది. రోడ్డు మార్గానికి చేరుకున్న తర్వాత.. ఓ ప్రైవేట్ కారులో ఆసుపత్రికి తరలించారు. ఈ గ్రామానికి రోడ్డు నిర్మాణంపై జిల్లా యంత్రాంగానికి పలుసార్లు దరఖాస్తు ఇచ్చినా.. స్పందన కరవైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.