తడిసి ముద్దవుతున్నా ఆగని 'పవార్' ప్రచార జోరు..! - శరద్ పవార్
వానలో తడుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. మహారాష్ట్ర సతారాలో శుక్రవారం రోజు బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా భారీ వర్షం మొదలైంది.. అయినా వేదికపై నుంచి దిగలేదు. 78 ఏళ్ల పవార్ వర్షంలో పూర్తిగా తడిసిపోయినా ప్రసంగం ఆపలేదు. అక్టోబర్ 21న జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు వరుణుడు కూడా ఆశీర్వదిస్తున్నాడని చెప్పుకొచ్చారు ఎన్సీపీ అధినేత. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను గెలిపించి పొరపాటు చేశారని, కానీ ఈ సారి ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
Last Updated : Oct 19, 2019, 10:15 AM IST