నడుభాగం జట్టుదే 'ఛాంపియన్స్ లీగ్ బోట్ రేస్' ట్రోఫీ - నడుభాగం జట్టు
కేరళలో నిర్వహించిన ఛాంపియన్స్ లీగ్ బోట్ రేసు ట్రోఫీని ఎగరేసుకుపోయింది నడుభాగం జట్టు. ఆగస్టు 31న ప్రారంభమై వివిధ స్థాయిల్లో నిర్వహించిన 12 రేసుల్లో అత్యధిక పాయింట్లు సాధించడమే కాక తుది పోరులో విజయం సాధించింది. కొల్లం పట్టణంలోని అష్టముడి సరస్సులో చివరి లీగ్ ప్రెసిడెంట్ ట్రోఫీ బోట్ రేసులో గెలిచి.. ఛాంపియన్స్ బోట్ లీగ్ టైటిల్ సాధించింది. పోటీలో తొమ్మిది జట్లు పాల్గొనగా పల్లతురుతి బోట్ క్లబ్ నేతృత్వంలోని నడుభాగం జట్టు తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. తదుపరి స్థానాల్లో పోలీస్ బోట్ క్లబ్ నేతృత్వంలోని కరిచల్ జట్టు, ఎన్సీడీసీ బోట్ క్లబ్ ఆధ్వర్యంలోని దేవాస్ జట్టు నిలిచాయి.
Last Updated : Nov 23, 2019, 8:20 PM IST