Live video: బైక్‌పైకి దూసుకెళ్లి.. బస్సును ఢీకొట్టి... - బైక్‌ను ఢీకొన్న ట్రక్కు
ద్విచక్ర వాహనంపైకి ఓ ట్రక్కు వేగంగా దూసుకెళ్లింది. అంతటితో ఆగకుండా ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. వెంటనే ట్రక్కు నుంచి దూకి.. డ్రైవర్ పరుగు తీశాడు. మహారాష్ట్ర ముంబయి నగరంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని పోలీసులు పేర్కొన్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.