బార్లో పోలీస్ ఇన్స్పెక్టర్ వీరంగం.. క్యాషియర్‌పై దాడి - ముంబయి ఏపీఐ వైరల్ వీడియో
Cop Assault On Cashier Of Bar: మహారాష్ట్ర ముంబయిలో ఓ అసిస్టెంట్ పోలీసు ఇన్స్పెక్టర్(ఏపీఐ) రెచ్చిపోయాడు. బార్లో క్యాషియర్‌ను దూషించడమేగాక అతనిపై దాడి చేశాడు. ఫుడ్ సర్వ్ చేసేందుకు నిరాకరించగా.. అతడు క్యాషియర్‌పై దాడి చేశాడని ముంబయి పోలీసులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (12:30 గంటలకు) ఈ ఘటన జరిగింది. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.