మాస్క్ లేదని ఫైన్.. అధికారుల్ని చితకబాదిన స్థానికులు
మహారాష్ట్ర ముంబయిలో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై స్థానికులు దాడి చేశారు. మాస్క్ ధరించలేదని ఓ మహిళకు జరిమానా విధించినందునే ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. మాతుంగా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.