వెలుతురులేమితో వాహనాలు పరస్పరం ఢీ - రాజస్థాన్ అల్వార్ జిల్లాలో బెహ్రోడ్ జాతీయ రహదారిపై డజనుకు పైగా వాహనాలు ఢీ
రాజస్థాన్ అల్వార్ జిల్లా బెహ్రోడ్లో పొగమంచు అలుముకుంది. వెలుతురులేమి కారణంగా జాతీయ రహదారిపై డజనుకు పైగా వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. క్రేన్ల సాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించారు అధికారులు. సరిగ్గా 15 రోజుల క్రితం ఈ రహదారిపైనే పొగమంచు కారణంగా అర డజను వాహనాలు ఢీకొన్నాయి. ఆ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.