వేలాది జింకలు ఒకేసారి రోడ్డు దాటడం ఎప్పుడైనా చూశారా? - వేలావదర్ జింక పార్కు వార్త
గుజరాత్ భావ్నగర్లో వేలాది జింకలు ఒక్కసారిగా రోడ్డు దాటిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వేలావదర్ జాతీయ జింకల పార్క్లో సుమారు 5000 వేల జింకలు ఉంటాయి. అయితే వాటిలో సుమారు మూడు వేలకు పైగా ఒకేసారి జింకలు రహదారిపైకి వచ్చాయి. వరుసగా ఇవి రోడ్డు దాటుతున్న దృశ్యం సముద్ర అలల ప్రవాహాన్ని తలపించింది. ఈ దృశ్యాలను ఓ స్థానికుడు మంగళవారం ఉదయం తమ ఫోన్లో బంధించాడు.