బారికేడ్ గ్రిల్ మధ్య తల ఇరుక్కుని విలవిల - పూరి జగన్నథుని ఆలయంలో నాలుగేళ్ల పాప తల బారికేడ్ గ్రిల్ మద్య ఇరుక్కున్న ఘటన
ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం వద్ద బారిగేడ్ గ్రిల్ మధ్య ప్రమాదవశాత్తు నాలుగేళ్ల బాలిక తల ఇరుక్కుంది. కళహండి జిల్లాకు చెందిన రామ్ నారాయణ్ రాథ్ తన కుటుంబంతో కలిసి పూరి జగన్నాథుని దర్శించుకుని స్టోర్ రూమ్లో సెల్ ఫోన్ను తీసుకోవడానికి వెళ్లారు. అక్కడే ఆడుకుంటున్న ఆయన కూతురు అగ్ని అంబిక..ఆటలో నిమగ్నమై.. బారికేడ్ గ్రిల్ మధ్య తలను ఇరికించింది. వెనక్కి తీయడానికి రాలేదు. అప్రమత్తమైన తల్లిదండ్రులు, చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించగా.. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. గ్యాస్ కట్టర్ సాయంతో ఇనుప కడ్డీని కత్తిరించగా..పాప తల సురక్షితంగా బయటపడింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.