లాక్డౌన్ రూల్స్ బ్రేక్- వేల మందితో దిల్లీ బస్టాండ్ కిటకిట
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. అయితే దిల్లీలో వలస కూలీలు మాత్రం ఉపాధి లేకపోవడం వల్ల రోడ్లపై నడుచుకుంటూ స్వస్థలానికి పయనమయ్యారు. అలాంటి వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఈ విషయం తెలిసిన వెంటనే దిల్లీలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఆనంద్విహార్ బస్టాండ్ ప్రాంగణానికి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఫలితంగా బస్టాండ్ మొత్తం జనంతో నిండిపోయింది.