పార్లమెంటుకూ కరోనా ఎఫెక్ట్.. మాస్క్‌తోనే ఎంపీ ప్రసంగం - మాస్క్ ధరించి పార్లమెంట్లో ప్రసంగం
కరోనా వైరస్ భయాలతో ముందు జాగ్రత్త చర్యగా మాస్క్‌లు ధరిస్తున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్, ఎంపీ నవ్‌నీత్ రవి రాణా పార్లమెంటులో మాస్క్ ధరించి ప్రసంగించారు. మహారాష్ట్ర అమరావతి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె.. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ సరఫరా అంశంపై మాట్లాడుతున్నపుడు ముసుగు ధరించారు. లద్దాక్ భాజపా ఎంపీ జమ్యాంగ్ నంగ్యాల్ కూడా పార్లమెంటుకు మాస్క్ ధరించి హాజరయ్యారు.