తెలంగాణ

telangana

ETV Bharat / videos

కాన్షీరాం శ్రద్ధాంజలి సభ.. వేలాదిగా తరలివచ్చిన జనం - మాయావతి సమాచారం

By

Published : Oct 9, 2021, 7:51 PM IST

బహుజన్ సమాజ్​ పార్టీ (బీఎస్​పీ) వ్యవస్థాపకుడు కాన్షీరాం 15వ వర్ధంతి సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్​లో శ్రద్ధాంజలి సభ నిర్వహించారు. లఖ్​నవూలోని కాన్షీరాం స్మారక స్థలం వద్ద ఆయనకు బీఎస్​పీ అధినేత్రి మాయావతి (mayawati news) నివాళులు అర్పించారు. ఈ సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. 2022 ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు మీడియా సంస్థల ముందస్తు సర్వేలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు మాయావతి. ప్రీ పోల్ సర్వేలతో ఎన్నికలు ప్రభావితమవుతాయని, ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే వాటిపై నిషేధం విధించాలని చెప్పారు. ముందస్తు ఎన్నికల సర్వేలు కొన్నిసార్లు ఓటర్లపై ప్రభావం చూపుతాయని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details