లైవ్ వీడియో: మసీదులో ప్రార్థనకు వెళ్లి శవమై ఇంటికి..! - మసీదులో ప్రార్థన చేస్తూ ఓ వ్యక్తి మృతి
ప్రాణం... నీటి బుడగ లాంటిది. ఈ వీడియో చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఓ వ్యక్తి మసీదులోకి వెళ్లి ప్రార్థన చేస్తున్నాడు. ఏమైందో తెలియదు. హఠాత్తుగా వెనక్కి పడిపోయాడు. పక్కనే ఉన్నవాళ్లు దగ్గరకు వెళ్లి చూసే సరికి చనిపోయాడు. ఈ ఘటన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని కడబా తాలూకా కలరా గ్రామంలో జరిగింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.