భద్రతను ఛేదించి ప్రియాంకను కలిసిన వీరాభిమాని - ప్రియాంక గాంధీ తాజా వార్తలు
ధోని, కోహ్లీకే కాదు.. రాజకీయ నాయకులకు వీరాభిమానులు ఉంటారు. అందులోనూ మాజీ ప్రధాని, ప్రజా నాయకురాలు ఇందిరా గాంధీ మనుమరాలు ప్రియాంక గాంధీని ఉత్తరాదిన ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్లో విశేషంగా ఆదరిస్తారు. లఖ్నవూలో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ప్రియాంకను కలిసేందుకు గుర్మీత్ సింగ్ గాంధీ.. అనే కార్యకర్త ధైర్యం చేసి భద్రత సిబ్బందిని దాటుకుని వెళ్లాడు. ఇది గమనించిన ఆమె.. సిబ్బందిని ఆపి అతనితో మాట్లాడి పంపించివేశారు.