వివాహ వేడుకలో అగ్నిప్రమాదం.. బూడిదైన 25 బైకులు - మహారాష్ట్ర అగ్నిప్రమాదం
మహారాష్ట్ర ఠాణె జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. భీవండిలోని ఓ మ్యారేజ్ హాల్‌లో వివాహ వేడుకలో ఈ మంటలు చెలరేగాయి. పార్కింగ్ స్థలంలో బాణాసంచా కాల్చడమే అగ్నిప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగలేదని పోలీసులు తెలిపారు. అయితే సమీపంలోని 25 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతైనట్లు పేర్కొన్నారు. అనుమతి లేకుండా కళ్యాణ మండపాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.