బావిలో చిరుతతో పిల్లి ఫేస్ టు ఫేస్! - చిరుతకు పిల్లి సవాల్
ప్రాణభయంతో పరిగెడుతున్న పిల్లి.. దానిని వెంటాడుతున్న చిరుత.. రెండూ ఒకేసారి బావిలో పడిపోయాయి. ఇంతలో ఆ చిరుత.. పిల్లికి దగ్గరగా రాసాగింది. ధైర్యాన్ని కూడగట్టుకుని పిల్లి చిరుతకు ఎదురునిలవగా.. ఆ వన్యమృగం వెనక్కి తగ్గింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అధికారులు.. బావిలో పడిపోయిన ఆ జంతువులను రక్షించారు.