Viral: చిన్న కారణం.. పెద్ద గొడవ.. - మధ్యప్రదేశ్ వైరల్ వీడియోలు
మధ్యప్రదేశ్ ఛత్తర్‌పూర్‌లోని తత్మా గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. సిమెంట్ ట్రక్కును ఖాళీ చేసే అంశంపై ఆరంభమైన వివాదం.. ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. రెండు వైపుల నుంచి జనాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.