'గోట్‌మార్' మేళా.. రాళ్లు రువ్వుకునే పండుగ! - గాయపడ్డారు
మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలోని పంధుర్ణలో సంప్రదాయ 'గోట్‌మార్' మేళా జరుగుతోంది. పంధుర్ణ, సవార్‌గావ్ గ్రామాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. కొలనులో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో ఇప్పటివరకు 168 మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. పోలీసు సిబ్బందిని మోహరించడం సహా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. డ్రోన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారు.
Last Updated : Sep 29, 2019, 1:25 AM IST