'ఉన్నావ్' ఘటనపై అఖిలేశ్ యాదవ్ ధర్నా - Unnao rape case latest news
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టింది సమాజ్‌వాదీ పార్టీ. లఖ్‌నవూలోని విధానసభ ముందు బైఠాయించారు మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఇతర నేతలు. ఇది చీకటి రోజని.. భాజపా సర్కారులో అత్యాచారాల సంఖ్య పెరిగిపోయిందని అఖిలేశ్ ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.