మద్యం మత్తులో యువతి హల్చల్- యువకుడిపై దాడి
నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిపై దాడి చేసింది యువతి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని అవధ్‌లో జరిగింది. ట్రాఫిక్ పోలీసు అడ్డుకున్నేందుకు ప్రయత్నించినా.. వెనక్కి తగ్గలేదు. అయితే.. యువతి మద్యం సేవించి ఉన్నట్లు సంఘటనా స్థలంలో ఉన్న వారు తెలిపారు. కారు నడిపే విషయంలో గొడవకుదిగినట్లు చెప్పారు. క్రిష్ణానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి వీరంగం దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారియి.