రోడ్డెక్కిన చేపలు.. స్తంభించిన రాకపోకలు - ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో చేపలతో నిండిన ట్రక్కు బోల్తా
చేపల కారణంగా ఉత్తరప్రదేశ్ కాన్పుర్‌లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆర్మాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కల్పిరోడ్ లో.. చేపలతో నిండిన ట్రక్కు బోల్తాపడింది. చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. వాటిని తీసుకెళ్లేందుకు స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. చేపలు, చుట్టూ చేరిన జనం కారణంగా ట్రాఫిక్ చాలా సేపు స్తంభించింది.