'అభిషేకం చేస్తుండగా కళ్లు తెరిచిన అయ్యప్ప విగ్రహం!' - కళ్లు తెరుచుకున్న అయ్యప్ప విగ్రహం
Lord Ayyappa Idol Eyes Opening: గణపతి విగ్రహం పాలు తాగడం, ఇంకొంతమంది దేవుళ్ల విగ్రహాలు కళ్లు తెరవడం లాంటి వార్తలు విన్నాం. తాజాగా అలాంటి ఘటనే తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. మణికంఠస్వామి ఆలయంలో అయ్యప్ప విగ్రహానికి అభిషేకం చేస్తుండగా.. విగ్రహం కళ్లు తెరిచినట్లు గుర్తించారు ఆలయ పూజారులు, భక్తులు. ఇలా ఒక్కసారి కాదు ఏకంగా నాలుగుసార్లు విగ్రహం కళ్లు మూస్తూ తెరుస్తూ ఉందన్నారు భక్తులు. గత శనివారం జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ కావడం వల్ల విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున ఆలయానికి పోటెత్తారు.