బావిలో జింక- చాకచక్యంగా కాపాడిన అటవీ సిబ్బంది - బావిలో పడిన జింకను అటవీ సిబ్బంది కాపాడారిలా..
కేరళలోని వెళ్లాంపురంలో ప్రమాదవశాత్తు ఓ బావిలో పడిన జింకను అటవీ అధికారులు రక్షించారు. గురువారం ఉదయం ఎల్‌పీ పాఠశాల సమీపంలోని పాడుబడ్డ బావిలో జింకను గుర్తించిన స్థానికులు.. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది బావిలోకి దిగి తాడు సాయంతో జింకను పైకి లాగారు. అనంతరం.. అడవిలోకి వదిలిపెట్టారు. బావి లోతు తక్కువగా ఉన్నందున జింకకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.