తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రజాగ్రహం: పోలీసులు అయితే సీటు బెల్టు పెట్టుకోరా? - సీటు బెల్టు

By

Published : Sep 14, 2019, 11:38 AM IST

Updated : Sep 30, 2019, 1:45 PM IST

డ్రైవర్​ సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనాన్ని నడుపుతున్నాడని ఓ పోలీసు జీపును అడ్డగించి వాగ్వాదానికి దిగారు బిహార్​ ముజఫర్​పుర్​లో స్థానికులు. సీటు బెల్టు ఎందుకు పెట్టుకోలేదని వాహనంలోని అధికారిని, డ్రైవర్​ను ప్రశ్నించారు. జనాలు గుమిగూడటం వల్ల వెంటనే వాహనంలోని ఇద్దరూ సీటు బెల్టు ధరించారు. అయినప్పటికీ ప్రజలు శాంతించలేదు. మీరు జరిమానా​ కట్టరా అంటూ వాహనం చుట్టూ మూగారు. ఈ నేపథ్యంలో ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నారు ఆ అధికారి. ఇటీవల కొత్త ట్రాఫిక్​ నిబంధనలతో సామాన్యులపై ఫైన్ల మోత మోగుతుంది. మరి అధికారులూ నిబంధనలు పాటించాలని డిమాండ్​ చేస్తున్నారు ప్రజలు.
Last Updated : Sep 30, 2019, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details