Viral: కుంగిన రోడ్డు- 400 మీటర్ల లోయలోకి ట్రక్కు - లోయలో పడ్డ బస్సు
హిమాచల్‌ప్రదేశ్ మండి జిల్లాలోని కలన్ఘర్ గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ ట్రక్కు 400 మీటర్ల లోయలో పడింది. అదృష్టవశాత్తు డ్రైవర్, క్లీనర్ తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రోడ్డు కుంగిన కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే అధికారులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.