వర్షంలో చెట్టుకింద సేదతీరుతున్న సింహాలు.. వీడియో వైరల్ - lions in rain video virul
వర్షం నుంచి రక్షణ పొందేందుకు మృగరాజులు చెట్ల కిందకు చేరి కాసేపు సేదదీరాయి. గుజరాత్‌లోని జునాగఢ్ అటవీ ప్రాంతంలో కనిపించిన ఈ దృశ్యాలు.. ఇప్పడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వర్షం కురుస్తున్నంతసేపూ చెట్ల కిందనే ఉన్న మృగరాజులు, కాస్త వర్షం తగ్గిన వెంటనే అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. ఇలా వానకు తడుస్తూ చెట్ల కిందకు చేరిన సింహాలను చూసిన వీక్షకులు విపరీతంగా లైకులు కొట్టేస్తున్నారు.