జనావాసాల్లో చిరుత హల్చల్.. సీసీటీవీ దృశ్యాలు వైరల్ - జనావాసాల్లో చిరుత హల్చల్
అడవిలో ఉండే చిరుతపులి అర్ధరాత్రి ఒక్కసారిగా ఊర్లోకి వచ్చి హల్ చల్ చేసిన ఘటన ఉత్తరాఖండ్ దేవప్రయాగ్‌లో జరిగింది. పశువుల పాక వద్దకు చిరుత రావడం వల్ల అక్కడ ఉన్న గేదెలు, ఆవులు భయంతో పరుగులు తీశాయి. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఉన్న సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆవులు, గేదెల అరుపులు విని బయటకు వచ్చిన ఓ పోలీస్.. చిరుతను చూడగానే మళ్లీ పోలీస్ స్టేషన్ లోపలికి పరుగు తీశాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.