గొర్రెల కోసం వచ్చి ఇంట్లో దూరిన చిరుత - ఇంట్లో దూరిన చిరుతపులి న్యూస్
కర్ణాటకలో ఓ ఇంట్లోకి ప్రవేశించిన చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారుల బృందం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. జలమంగళ గ్రామంలోని నాగరాజు ఇంట్లో ఉన్న గొర్రెలు, కుక్కల కోసం వచ్చిన చిరుత అనుకోకుండా ఇంట్లోకి దూరింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు బయటనుంచి తలుపులు వేశారు. సమాచారం అందుకున్న రామనగర అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని.. మత్తుమందు ఇచ్చి చిరుతను బంధించారు. గత నెల రోజులుగా తమను భయబ్రాంతులకు గురిచేస్తున్న చిరుతను బంధించటం వల్ల గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.