గ్రామస్థులపై చిరుత దాడి- కర్రలతో తరిమికొట్టిన ప్రజలు! - Leopard attacks in Uttarakhand
ఉత్తరాఖండ్లో అటవీ జంతువులు.. ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పురోలా ప్రాంతంలో సంచరిస్తోన్న ఓ చిరుత.. గ్రామస్థులపై దాడికి యత్నించింది. అప్రమత్తమైన ప్రజలు, దానిని వెంబడించి కర్రలతో తరిమికొట్టారు. గతంలోనూ ఇదే తరహాలో దాడిచేసి ఇద్దరిని గాయపరిచిందీ చిరుత. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.