కూల్‌గా ఇంట్లోకి వెళ్లి.. కుక్కను ఎత్తుకుపోయిన చిరుత - leopard viral videos latest
ఉత్తరాఖండ్ హల్ద్వానీలో కాట్గోదామ్ ప్రాంతంలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న పెంపుడు శునకాన్ని చిరుత ఎత్తికెళ్లింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. అడుగులో అడుగు వేసుకుంటూ ఎవరి కంట పడకుండా కూల్‌గా ఇంట్లోకి ప్రవేశించింది. కుక్కను నోట కరుచుకుని అక్కడ నుంచి రోడ్డుపైకి దూకింది. ఇదే సమయంలో ఓ కారు.. చిరుతను ఢీకొట్టబోయింది. అయితే అది తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.