నవ్వుల నిరసన.. రోడ్డు కోసం స్థానికుల వింత ఆందోళన - నవ్వుల ఆందోళన
వర్షాలు, భారీ వాహనాల రాకపోకలతో రహదారి ధ్వంసమైంది. అధికారుల చుట్టూ తిరిగితే (Road repair laughing protest) రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు నిధులు కూడా మంజూరయ్యాయి. రెండేళ్లు గడిచినా నిర్మాణం మాత్రం చేపట్టలేదు. ఎవరిని అడిగినా సమాధానమూ రావడంలేదు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు... మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ (Madhya Pradesh laugh protest) వాసులు వినూత్న మార్గం ఎంచుకున్నారు. 200 మీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా నిలబడి పెద్ద పెట్టున్న నవ్వుతూ నిరసన తెలిపారు. ఆనంద్ విహార్ కాలనీకి చెందిన పిల్లలు, పెద్దలు ఆదివారం ఈ నవ్వుల నిరసనలో పాల్గొన్నారు. రోడ్డును వెంటనే నిర్మించాలంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. గతంలో ఆందోళన నిర్వహిస్తే కొంతవరకు పనులు మొదలు పెట్టి మళ్లీ ఆపేశారని స్థానికులు చెప్పారు. అందుకే మళ్లీ నిరసనబాట పట్టినట్లు వివరించారు.