పని చేస్తుండగా మ్యాన్‌హోల్‌లో పడిన కార్మికుడు - వారణాసిలో మ్యాన్‌హోల్‌లో పడిన కార్మికుడు
మ్యాన్‌హోల్‌లో పనిచేసేందుకు దిగిన ఓ కార్మికుడు పొరపాటున 30 అడుగుల లోతున చిక్కుకుపోయాడు(Labour stucks in manhole). ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ వారణాసి జిల్లాలోని(Varansi labour trapped in manhole) లహురాబీర్ ప్రాంతంలో జరిగింది. మ్యాన్‌హోల్‌లో పడిన వ్యక్తిని బంగాల్‌కు చెందిన 20 ఏళ్ల నవాబ్‌గా గుర్తించారు. నవాబ్‌ను బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. లోపల నీటి ఒత్తిడి అధికంగా ఉండడం కారణంగా సహాయక చర్యలు కష్టతరంగా మారాయని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ అసిమ్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఘటనాస్థలికి ప్రజలు భారీగా చేరుకున్నారు.