ఇవే ఆమె చివరి మాటలు.. వీడియో వైరల్! - కేరళ హెల్త్ వర్కర్ అశ్వతి చివరి మాటలు
కేరళ వయనాడ్‌లో లాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న అశ్వతి అనే మహిళ కరోనా కారణంగా మరణించారు. అయితే ఆమె చనిపోయే ముందు మాట్లాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరణం తథ్యం అని తెలిసినా పెదాలపై చెరగని చిరునవ్వుతో..."అంతా అయిపోయింది. చేసేదేమీ లేదు. అందరం ప్రార్థన చేద్దాం. చెప్పాల్సింది ఇంకేం లేదు." అని అశ్వతి మాట్లాడిన మాటలు నెటిజెన్ల చేత కంటతడి పెట్టిస్తున్నాయి. మనంతవడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మెరుగైన చికిత్స కోసం కోజికోడ్‌లోని వైద్య కళాశాలకు తరలిస్తుండగా ఆమె చనిపోయారు.