తమిళ పోరు: సైకిల్‌పై విజయ్- సామాన్యులతో అజిత్ - రజనీకాంత్ ఓటు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య-కార్తి ఉదయాన్నే ఓటేశారు. వీరిలో పలువురు క్యూలో నిలబడి.. సామాన్య ప్రజలతో కలిసి ఓటు వేశారు. విజయ్ మాత్రం.. సైకిల్ మీద పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.