తెలంగాణ

telangana

ETV Bharat / videos

దంతాలు శుభ్రం.. గిన్నిస్​ రికార్డు సొంతం.. - news on odidha

By

Published : Nov 8, 2019, 8:40 AM IST

అంతర్జాతీయ టూత్​ బ్రషింగ్​ డే(దంతాలు శుభ్రం చేసుకునే దినోత్సవం) సందర్భంగా ఒడిశా భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సోషల్ సైన్సెస్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. 26 వేల 382 విద్యార్థులు ఒకేసారి బ్రష్​ చేసుకొని గిన్నిస్ రికార్డ్ సాధించారు. అత్యధిక మంది ఒకేసారి దంతధావనం చేసిన కార్యక్రమంగా ఇది గిన్నిస్‌ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది. నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, కోల్గేట్ పాల్మొలివ్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఈ రికార్డు దిల్లీ పబ్లిక్​ స్కూల్ పేరిట ఉండేది. 16 వేల 414 మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details