కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రోబోలు సాయం - కరోనాపై రోబోలతో అవగాహన
కేరళలో కరోనాపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టింది కొచ్చికి చెందిన కేరళ స్టార్టప్ మిషన్ సంస్థ. రెండు రోబోల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొచ్చిలోని ఓ ప్రముఖ హోటల్‌కు వచ్చే వినియోగదారులకు ఆహారాన్ని అందిస్తూ తినే ముందు చేతులను శుభ్రం చేసుకోవాలనే సందేశాన్ని దృశ్య రూపంలో ప్రదర్శిస్తున్నాయీ రోబోలు. మర మనుషులు సందేశాన్ని సమర్థవంతంగా చెప్పగలవని, అంతేకాకుండా శానిటైజర్లను, మాస్క్‌లను కూడా రోబోలు అందజేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు జయకృష్ణన్ తెలిపారు.