ఇంట్లో 'కోబ్రా'ల మకాం.. తవ్వినకొద్దీ బయటకు! - కోబ్రాల గుంపు
ఇంట్లోంచి గుట్టలుగా కోబ్రా పాములు బయటపడితే.. ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా. ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ కట్నీ జిల్లాలో జరిగింది. కరౌందీ ఖుర్ద్ గ్రామానికి చెందిన సరోజ్ సింహ గౌడ్ అనే వ్యక్తి తన ఇంట్లో పాము ఉన్నట్లు అనుమానించి పునాదుల్లో తవ్వకాలు చేపట్టాడు. ముందు ఒకటి బయటపడింది. ఆ తర్వాత మరింత లోతుగా తవ్వగా.. ఒక్కొక్కటిగా బయటకు రావటం మొదలుపెట్టాయి. మొత్తం 18 కోబ్రా పిల్లలు వచ్చినట్లు సరోజ్ తెలిపారు. పాములు పట్టేవారికి సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకుని వాటిని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. కోబ్రా పిల్లల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.