కశ్మీరం.. ఎటు చూసినా హిమ మయం - కశ్మీర్లో హిమపాతం నమోదు
జమ్ము కశ్మీర్లో శనివారం ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. ఉత్తర కశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, బందిపోరా ప్రాంతాల్లో 2 సెం.మీ. పైగా హిమపాతం నమోదైంది. దక్షిణ కశ్మీర్లోని అన్ని జిల్లాల్లో భూమి ఒక్కో సెం.మీ. మేర మంచుతో నిండిపోయింది. రహదారులన్నీ పూర్తిగా మంచుమయం అయ్యాయి. చలి ప్రభావంతో కశ్మీర్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. విమాన సేవలను పూర్తిగా నిలిపివేసే యోచనలో అధికారులు ఉన్నారు. జనవరి 31 వరకు కశ్మీర్లో కోల్డ్ వేవ్ కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.