హైవేపై ఏనుగు హల్‌చల్- వాహనాన్ని అడ్డగించి.. - కర్ణాటకలో గజరాజు
కర్ణాటకలో ఓ ఏనుగు జాతీయరహదారిపై హల్‌చల్ చేసింది. కర్ణాటక- తమిళనాడు సరిహద్దు అటవీప్రాంతంలోని బన్నారి చెక్‌పోస్ట్ వద్ద అరటి పండ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఓ భారీ గజరాజు అడ్డగించింది. పండ్ల కోసం వాహనం పైకి ఎక్కేందుకు యత్నించింది. ఈ నేపథ్యంలో.. ఏనుగును తరిమేందుకు ఇతర వాహనదారులు భారీ శబ్దాలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన గజరాజు అక్కడ వారి వెంటపడడం వల్ల భయంతో పరుగులు తీశారు. కొంతసేపటి తరువాత అక్కడికి వచ్చిన అటవీ అధికారులు.. ఏనుగును అడవిలోకి తరిమి వేయగా అంతా ఊపిరిపీల్చుకున్నారు.