నీట మునిగిన గుడిలో పూజారి ప్రార్థనలు - నీట మునిగిన ఆలయంలో పూజారి ప్రార్థనలు
కర్ణాటకలోని ఓ పూజారి వరదలను కూడా లెక్కచేయకుండా గుడిలో పూజలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బీమా నది పొంగి.. కలబురగి పరిధిలోని ఫిరోజాబాద్ గ్రామం నీట మునిగింది. చాలా ఇళ్లు సహా స్థానికంగా పేరున్న మహాలక్ష్మి మందిర్ కూడా వరద నీటిలోనే చిక్కుకుంది. అయితే ఆ ఆలయ పూజారి హనుమంత మాత్రం ప్రతిరోజులాగే తన విధి నిర్వర్తిస్తున్నారు. నీటిలో ఈదుకుంటూ వెళ్లి మహాలక్ష్మి, అంబిగర చౌడయ్య విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నారు. ఇలా వర్షాకాలంలోనూ పూజలు ఆపకపోవడంపై స్థానికులు పూజారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
TAGGED:
Kalaburagi priest swimming